మరోసారి మంచి మనసు చాటుకున్న సుష్మా స్వరాజ్‌

18 Apr, 2019 13:24 IST|Sakshi

న్యూఢిల్లీ : సరైన పత్రాలు లేక విదేశాల్లో చిక్కుకుని  ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు ఇదే మాట చెబుతుంటారు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌. ప్రపంచంలో ఏ మూలన ఉన్న భారతీయులైన సరే తన సమస్య గురించి ఒక్క ట్వీట్‌ చేస్తే చాలు.. వెంటనే రెస్పాన్స్‌ అవుతారు చిన్నమ్మ. తాజాగా ఇలాంటి సంఘటన మరోటి చోటు చేసుకుంది. అలీ అనే వ్యక్తి సౌదీ వెళ్లి దాదాపు రెండు సంవత్సరాలు కావోస్తుంది. ఇండియా తిరిగి రావాలని అనుకుంటున్నాడు. కానీ అతని దగ్గర విక్మా(ఉద్యోగ వీసా) తప్ప పాస్‌పోర్ట్‌, వీసాలాంటి ఇతర ఐడీలు ఏం లేవు. ఈ క్రమంలో తనకు సాయం చేయమని ఇండియన్‌ ఎంబసీని కోరాడు.

తాను ఇక్కడకు వచ్చి దాదాపు 21 నెలలు కావోస్తుందని.. ఇంతవరకూ సెలవు తీసుకోలేదని తెలిపాడు. ప్రస్తుతం ఇంట్లో సమస్యలున్నాయి.. అందుకే ఇండియా వెళ్లాలి అనుకుంటున్నాను అన్నాడు. కానీ వర్క్‌ వీసా తప్ప మరే ఐడీ తన దగ్గర లేదని సాయం చేయమని కోరాడు. ఇలా ఏడాది నుంచి అభ్యర్తిస్తూనే ఉన్నాడు. కానీ ఫలితం లేకపోయింది. దాంతో ఆఖరి ప్రయత్నంగా మరోసారి ‘నన్ను ఇండియా పంపించి పుణ్యం కట్టుకొండి. నాకు ఇంటి దగ్గర నలుగురు పిల్లలున్నారు. సంవత్సరం నుంచి సాయం కోరుతున్నాను. కానీ ఎటువంటి స్పందన లేదు. కనీసం నాకు సాయం చేస్తారో లేదో చెప్పండి. మీరు సాయం చేయకపోతే ఆత్మహత్యే నాకు శరణ్యం’ అని ట్వీట్‌ చేశాడు.

అలీ అభ్యర్థన కాస్తా సుష్మా స్వరాజ్‌ దృష్టికి వచ్చింది. దాంతో ఆమె ‘వద్దు ఆత్మహత్య లాంటి ఆలోచనలు చేయకండి. మేం మీకు సాయం చేస్తాం’ అని తెలపడమే కాక ఈ కంప్లైంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తనకు పంపించాల్సిందిగా రియాద్‌లో ఉన్న ఇండియన్‌ ఎంబసీని ఆదేశిస్తూ ట్వీట్‌ చేశారు. దాంతో మరో సారి నెటిజనుల​ సుష్మా స్వరాజ్‌ మంచి మనసును మెచ్చుకుంటున్నారు. (చదవండి : అంతా మేడమ్‌ దయ వల్లే..!)

మరిన్ని వార్తలు