నేడు పాక్‌కు సుష్మ

8 Dec, 2015 06:13 IST|Sakshi
నేడు పాక్‌కు సుష్మ

న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ద్వైపాక్షిక చర్చలు, అఫ్ఘానిస్తాన్‌పై  సదస్సు కోసం మంగళవారం పాకిస్తాన్‌కు వెళ్తున్నారు. 9న ’హార్ట్ ఆఫ్ ఆసియా’ పేరుతో జరిగే ఈ సదస్సులో భారత ప్రతినిధుల బృందానికి ఆమె నేతృత్వం వహిస్తారు. భారత్, పాక్ ఎన్‌ఎస్‌ఏల భేటీ నేపథ్యంలో ఆమె  పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

 

సుష్మ అఫ్ఘాన్ సదస్సు సందర్భంగా బుధవారం పాక్ ప్రధాని షరీఫ్‌తో, విదేశాంగ విధానాల్లో ఆయన సలహాదారు సర్తాజ్ అజీజ్‌లతో భేటీ అవుతారు. 2012లో అప్పటి విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ పాక్‌లో చేపట్టిన పర్యటించాక భారత విదేశాంగ మంత్రి అక్కడికి వెళ్లనుండడం ఇదే తొలిసారి. కాగా, పాక్-భారత్ సంబంధాల్లో ప్రతిష్టంభన కొంతమేరకు తొలగిందని, సుష్మాతో తాను జరిపే చర్చల్లో సమగ్ర చర్చల ప్రక్రియ పునరుద్ధపై దృష్టి సారించనున్నట్లు అజీజ్ అన్నారు.

మరిన్ని వార్తలు