ఐఎం కీలక ఉగ్రవాది ఎజాజ్ అరెస్టు

7 Sep, 2014 01:14 IST|Sakshi
ఐఎం కీలక ఉగ్రవాది ఎజాజ్ అరెస్టు

10 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించిన ఢిల్లీ కోర్టు
సహారన్‌పూర్/ న్యూఢిల్లీ: పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న పేరుమోసిన ఉగ్రవాది, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద (ఐఎం) సంస్థ సభ్యుడు ఎజాజ్ షేక్ (27)ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు విభాగం అధికారులు ఎజాజ్‌ను శుక్రవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ రైల్వేస్టేషన్ వద్ద పట్టుకున్నారు. జామా మసీదుపై దాడి సహా పలు కేసుల్లో  పోలీసులు అతనికోసం చాలాకాలం నుంచి వెతుకుతున్నారు. సాంకేతిక రంగంలో నైపుణ్యం ఉన్న ఎజాజ్ పుణేవాసి అని, ఐఎంలో కీలకమైన స్థానంలో ఉన్నాడని ప్రత్యేక పోలీసు కమిషనర్ ఎస్.ఎన్.శ్రీవాస్తవ తెలిపారు. కాగా, శనివారం ఎజాజ్‌ను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతడిని 10 రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఢిల్లీలో అక్రమంగా ఆయుుధాల తయూరీ ఫ్యాక్టరీని నెలకొల్పడంతోపాటు పలు ఇతర నేరాల్లో ఎజాజ్ ప్రమేయం ఉన్నట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు. పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నడుపుతున్న వురో ఉగ్రవాది మొహసిన్ చౌదరికి ఎజాజ్ సమీప బంధువని తెలుస్తోంది. ఇదిలా ఉండగా పోలీసులు అతడినుంచి ఒక లాప్‌టాప్, పలు మొబైల్ ఫోన్‌లు, సిమ్‌కార్డులు, పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న మొహసిన్, ఇండియున్ ముజాహిదీన్ వ్యవస్థాపకులు ఇక్బాల్ భత్కల్, రియూజ్ భత్కల్ ఆదేశాలమేరకు తాను పనిచేస్తున్నట్టు ఎజాజ్ షేక్ పోలీసుల విచారణలో తెలిపాడు.

కాగా, 2010లో వారణాసిలో జరిగిన పేలుళ్లతోపాటు జావూవుసీదుపై దాడి తర్వాత వాటిని తామే చేసినట్టు ఎజాజ్, మీడియూ సంస్థలకు ఆకాశరావున్న ఈమెయిల్స్ పంపించాడని తేలింది. ఇలాంటి ఈ మెయిల్స్ ఎవరు పంపుతున్నారన్న విషయుం ఇప్పటివరకు పోలీసులకు మిస్టరీగానే ఉంది. ఎజాజ్ అరెస్టుతో ఆ చిక్కుముడి వీడింది. దాడుల సందర్భంగా ఐఎంకు చెందిన ఇతర ఉగ్రవాదులకు ఎజాజ్ సాంకేతిక సహకారం అందజేసేవాడని, అలాగే తవు సంస్థకు సంబంధించి హవాలా కార్యకలాపాలుకూడా సాగించేవాడని వెల్లడైంది.

మరిన్ని వార్తలు