పోలీసుల అదుపులో ఐఎస్‌ఐ ఏజెంట్‌

15 Mar, 2019 14:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సైనికులకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తున్న ఐఎస్‌ఐ ఏజెంట్‌గా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని జలంధర్‌లో పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. నిందితుడిని ఫజాలికా ప్రాంతానికి చెందిన రామ్‌ కుమార్‌గా గుర్తించారు. కుమార్‌ నుంచి రెండు మొబైల్‌ ఫోన్లు, నాలుగు సిమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. తాను డబ్బుకు ఆశపడి పాకిస్తాన్‌లోని ఐఎస్‌ఐ ఏజెంట్లతో టచ్‌లో ఉంటున్నానని నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

ఇండో-పాక్‌ సరిహద్దులో భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌ ఏజెంట్లతో పంచుకుంటానని చెప్పాడని వెల్లడించారు. సరిహద్దుల్లో భారత జవాన్ల కదలికలపైనా నిందితుడు నిఘా వేసేవాడని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌ సైనిక ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ నుంచి అందిన సమాచారం మేరకు అతడి కదలికలను పసిగట్టి స్ధానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం తదుపరి విచారణ కోసం నిందితుడిని పోలీసులు చండీగఢ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు