జైల్లో బహిష్కృత ఎంపీ ఆత్మహత్యాయత్నం

14 Nov, 2014 15:05 IST|Sakshi
జైల్లో బహిష్కృత ఎంపీ ఆత్మహత్యాయత్నం

కోల్కతా:  పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన శారదా గ్రూపు చిట్ఫండ్ కుంభకోణంలో నిందితుడుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కునాల్ ఘోష్ శుక్రవారం జైల్లో ఆత్మహత్యాయత్నం చేశారు. కోల్కతా ప్రెసిడెన్సీ జైల్లో ఉన్న ఆయన 58 నిద్రమాత్రలు మింగి ఈ ఘటనకు పాల్పడ్డారు. కునాల్ ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన జైలు అధికారులు హుటాహుటీన ఎన్ఎన్కెఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.

కాగా  కునాల్ ఘోష్పై ఆరోపణలు రావటంతో తృణమూల్ కాంగ్రెస్ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. కునాల్  గత నవంబర్ లో అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. శారదా గ్రూపు మీడియా విభాగం సీఈవోగా వ్యవహరించిన ఆయనపై చీటింగ్ సహా పలు అభియోగాలు ఉన్నాయి.

మరోవైపు కునాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించటంతో జైల్లోనే ఉన్నారు. శారద స్కాంలో ప్రమేయం ఉన్న చాలామంది స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని, మూడు రోజుల క్రితం కునాల్ కోర్టుకు వెల్లడించారు. వారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన కోరారు.

>
మరిన్ని వార్తలు