వాజ్‌పేయికి నివాళి; స్వామి అగ్నివేష్‌పై దాడి

17 Aug, 2018 14:15 IST|Sakshi
స్వామి అగ్నివేష్‌పై దాడి చేస్తోన్న బీజేపీ కార్యకర్తలు

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి (93) పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. కడసారి వాజ్‌పేయిని దర్శించుకునేందుకు వచ్చిన అగ్నివేష్‌పై బీజేపీ కార్యకర్తలు సామూహికంగా దాడి చేశారు. ఈ విషయం గురించి అగ్నివేష్‌ మాట్లాడుతూ ‘వాజ్‌పేయి గారికి నివాళులర్పించేందుకు నేను ఇక్కడకు వచ్చాను. కానీ పోలీసు బందోబస్తు ఉండటం వల్ల నడుచుకుంటూ వస్తున్నాను. ఇంతలో ఉన్నట్టుండి కొందరు యువకులు వచ్చి నా మీద దాడి చేయడం ప్రారంభించారు. మేము ఇద్దరం, ముగ్గరమే ఉన్నాం.. కానీ వాళ్లు గుంపుగా వచ్చారు. వాళ్లు నా తలపాగాను పడేసి, మమ్మల్ని తిడుతూ, మా పై దాడి చేశార’ని తెలిపారు.

అంతేకాక ‘వారిలో కొందరు నన్ను ఉద్దేశిస్తూ అతను దేశద్రోహి.. కొట్టండి, కొట్టండి అంటూ నా మీద దాడికి పురిగొల్పార’ని అగ్నివేష్‌ తెలిపారు. అయితే అగ్నివేష్‌పై దాడి జరగడం ఇది రెండో సారి. గతంలో ఒకసారి జార్ఖండ్‌లో బీజేపీ కార్యకర్తలు అగ్నివేష్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు