స్వైన్‌ఫ్లూ కలకలం

28 Aug, 2018 13:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భువనేశ్వర్‌/ఖుర్దారోడ్‌ : రాష్ట్రంలో ఈ సీజన్‌లో తొలి స్వైన్‌ఫ్లూ కేసును ఖుర్దా జిల్లాలోని నచుని ప్రాంతంలో సోమవారం గుర్తించారు. కొద్దిరోజుల నుంచి జలుబు, దగ్గుతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఓ మహిళకు వైద్య పరీక్షలు చేయగా బాధిత మహిళకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఇదే విషయాన్ని స్థానిక ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రం(ఆర్‌ఎంఆర్‌సీ) కూడా ఖరారు చేయడంతో స్వైన్‌ఫ్లూ కేసు వెలుగులోకి వచ్చింది. స్వైన్‌ఫ్లూ బారిన పడిన మహిళ 23 ఏళ్ల యువతి కావడం బాధాకరం.

2017లోనే రాష్ట్రం స్వైన్‌ఫ్లూ భయానక పరిస్థితులను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో సుమారు 400 మంది స్వైన్‌ఫ్లూ బారిన పడగా, 50 మంది చనిపోయినట్టు వైద్యవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు నగరంలో చోటు చేసుకున్న తాజా సంఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్వైన్‌ఫ్లూ విస్తరించకుండా తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వ్యవసాయరంగంలో మార్పులు అవసరం : ఉపరాష్ట్రపతి

జర్నలిస్ట్‌ హత్య కేసులో డేరా బాబాకు జీవిత ఖైదు

‘ఆమెను నమ్మడం అంత మంచిది కాదు’

‘అమిత్‌ షాకు అందుకే స్వైన్‌ఫ్లూ సోకింది’

కుమార స్వామి సర్కార్‌ను కూలదోయం : యడ్యూరప్ప

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఇండియన్‌ 2’ షూటింగ్‌ రేపే ప్రారంభం!

శంకర్‌ సినిమాలో మరోసారి విలన్‌గా..!

‘మహర్షి’ మరింత ఆలస్యం కానుందా..!

రణవీర్‌కు దీపిక షరతులు..!

‘ఆయ‌న ఎంతో మందికి స్ఫూర్తి’

‘సరిహద్దు’ సైనికుడుగా తనీష్