తబ్లిగీ జమాత్ చీఫ్‌ కుమారుడి విచారణ

6 May, 2020 09:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్‌ కుమారుడిని ఢిల్లీ క్రైమ్‌ బబ్రాంచ్‌ పోలీసులు ప్రశ్నించారు. మంగళవారం రెండు గంటల పాటు అతడిని ప్రశ్నించినట్టు ‘హిందూస్తాన్‌ టైమ్స్‌’ వెల్లడించింది. నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్‌వద్ద పనిచేసిన 20 మంది ఆచూకీ అడిగినట్టు సమాచారం. కరోనా వైరస్‌ వ్యాప్తి పెరిగిన తర్వాత జమాత్‌కు వ్యతిరేకంగా పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ 20 మంది కనిపించకుండా పోయారు. ట్రావెల్‌ ఏజెంట్ల ద్వారా వీరి గురించి పోలీసులకు తెలిసింది. వీరి ఫోన్ రికార్డులు, ఇమెయిల్‌ల ద్వారా కీలక సమాచారాన్ని పోలీసులు కనుగొన్నట్టు సమాచారం. (3,900 కేసులు.. 195 మరణాలు)

జమాత్‌ కార్యకలాపాల్లో మౌలానా సాద్‌ కుమారుడి ప్రమేయం ఉన్నందున పోలీసులు అతడిని విచారించారు. జమాత్‌ ప్రధాన  కార్యాలయం కార్యకలాపాల గురించి, అక్కడ పనిచేసే సిబ్బంది గురించి పోలీసులు ఆరా తీసినట్టు తెలిసింది. మౌలానా సాద్‌కు మరోసారి కరోనా నిర్థారిత పరీక్షలు నిర్వహించాలని అతడిని పోలీసులు ఆదేశించినట్టు సమాచారం. దేశంలో కరోనా ఎక్కువగా వ్యాపించడానికి మార్చిలో నిర్వహించిన జమాత్‌ కారణమైందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులకు మౌలానా సాద్‌ పూర్తిగా సహకరిస్తున్నారని, మర్కజ్‌లో ఎటువంటి అక్రమ కార్యకలాపాలు జరగడం లేదని ఆయన తరపు న్యాయవాది ఇంతకుముందు ప్రకటించారు. (ఫేక్‌ న్యూస్‌: అతడి సొమ్ములు సేఫ్‌)

మరిన్ని వార్తలు