తబ్లిగ్‌ జమాత్‌ : ఆడియో విడుదల

2 Apr, 2020 11:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీనిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌ మసీదు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మర్కజ్‌లో గత నెల 13 నుంచి 15 వరకు నిర్వహించిన మతపరమైన ప్రార్థనాల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్‌ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మతపరమైన ప్రార్థనలు నిర్వహిం‍చిన మౌలానా సాద్‌పై ఢిల్లీ పోలీసు కమిషనర్‌ ఎస్‌. ఎన్‌. శ్రీవాత్సవ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ‘తబ్లిగ్‌ జమాత్‌’ మతపరమైన ప్రార్థన కార్యక్రమాన్ని నిర్వహించిన మౌలానా సాద్‌ కంధల్వి  ఓ ఆడియోను విడుదల చేశారు. (తబ్లిగి జమాత్‌ : ఈశాన్యానికి విషపు వైరస్‌)

తాను వైద్యుల సలహా మేరకు ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు. ఈ మేరకు ‘‘తబ్లిగ్‌ జమాత్‌’ కి హాజరైన వారు వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే ఉండాలి. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించాలి. అధికారులకు సహకరించాలి’ ఆయన కోరారు. మరోవైపు నిజాముద్దీన్‌ మర్కజ్‌పై లోతైన దర్యాప్తు చేపట్టినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. భారత్‌లో ఇప్పటి వరకు 1980 మంది కరోనా వైరస్‌ బారినపడగా, 59 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 144 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. (‘ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకోవచ్చు’)

మరిన్ని వార్తలు