క్వారంటైన్‌లోని తబ్లిగి జమాత్‌ సభ్యుల వికృత చర్య

8 Apr, 2020 16:18 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో జరిగిన తబ్లిగి జమాత్‌ అనంతరం దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో దేశంలో అన్ని రాష్ట్రాలు తబ్లిగి జమాత్‌ సమావేశానికి హాజరైన వారిని గుర్తించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కరోనా లక్షణాలు లేని తబ్లిక్‌ సభ్యులను క్వారంటైన్‌ చేశాయి. అయితే వీరిలో కొందరు వైద్య సిబ్బందితో, అధికారులతో అసభ్యకరంగా ప్రవరిస్తున్నారు. దీంతో కోన్నిచోట్ల వారిని డీల్‌ చేయడం కష్టంగా మారింది. తాజాగా ఢిల్లీ ద్వారకాలోని ఢిల్లీ అర్బన్‌ షెల్టర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ బోర్డ్‌లోని ప్లాట్‌లలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్న కొందరు తబ్లిగి జామాత్‌ సభ్యులు వికృత చర్యకు పాల్పడ్డారు. బాటిల్స్‌లో మూత్రం నింపి వాటిని బయటకు విసిరివేశారు. 

ఇందుకు సంబంధించి సదరు క్వారంటైన్‌ విభాగం అసిస్టెంట్‌ డైరెక‍్టర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్వారక నార్త్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తబ్లిగి సభ్యులు క్వారంటైన్‌లో ఉన్న ప్రాంతంలో మూత్రం నింపిన రెండు బాటిల్స్‌ లభ్యమైనట్టుగా తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ పనికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. కరోనాను విస్తరించే ఆలోచనతో తబ్లిగి జామాత్‌ సభ్యులు ఈ చర్యకు పాల్పడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, ఢిల్లీలోని మర్కజ్‌లో ప్రార్థనల అనంతంరం ఇళ్లకు చేరకున్న పలువురు తబ్లిగి జమాత్‌ సభ్యుల్లో కొందరు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించకుండా రహస్యంగా ఉంటున్నారు.

మరిన్ని వార్తలు