తబ్లిగి మర్కజ్‌ చీఫ్‌ ఆడియో సందేశం

17 Apr, 2020 17:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నిజాముద్దీన్‌ తబ్లిగి జమాత్‌ మర్కత్‌ చీఫ్‌ మౌలానా సాద్‌ శుక్రవారం ఆడియో సందేశం విడుదల చేశారు. ‘ప్రస్తుత విపత్కర పరిస్ధితుల్లో మీరు సహనంగా ఉండాల్సిన అవసరం ఉంది..సహనంతోనే మీరు మీ సమస్యలను అధిగమిస్తార’ని ఈ ఆడియో క్లిప్‌లో మౌలానా బిగ్గరగా చెబుతుండటం వినిపించింది. కాగా ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగి జమాత్‌ మర్కజ్‌ అనంతరం కోవిడ్‌-19 కేసులు దేశవ్యాప్తంగా పెరిగాయని కేంద్రం పేర్కొన్న సంగతి తెలిసిందే.

మౌలానా సాద్‌ ప్రస్తుతం సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 13,387కు చేరగా మృతుల సంఖ్య 437కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1007 కేసులు నమోదవగా, 23 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఇక మహమ్మారి బారి నుంచి కోలుకుని 1749 మంది డిశ్చార్జి అయ్యారు.

చదవండి : తబ్లిగీ నేతపై ఈడీ కేసు

>
మరిన్ని వార్తలు