నోబెల్‌ను టాగూర్‌ తిరస్కరించారట!

12 May, 2018 04:43 IST|Sakshi

అగర్తలా: ఇటీవల తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న త్రిపుర సీఎం విప్లవ్‌ దేవ్‌ మరోసారి నోరుజారి విమర్శలను ఎదుర్కొంటున్నారు. జాతీయ గీత రచయిత, ప్రముఖ కవి రవీంద్ర నాథ్‌ టాగూర్‌ అప్పట్లో బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన సాహిత్య నోబెల్‌ బహుమతిని వెనక్కు ఇచ్చారని విప్లవ్‌ దేవ్‌ అన్నారు. గీతాంజలి నవలకు 1913లో టాగూర్‌కు నోబెల్‌ ఇచ్చారు. వాస్తవానికి బ్రిటిష్‌ ప్రభుత్వం తనకు ఇచ్చిన ‘బ్రిటిష్‌ నైట్‌హుడ్‌’ బిరుదును జలియంవాలా బాగ్‌ ఊచకోతకు నిరసనగా 1919లో టాగూర్‌ వదిలేశారు. నోబెల్‌ను తిరస్కరించలేదు. కానీ విప్లవ్‌ దేవ్‌ మాత్రం బ్రిటిష్‌ పాలనకు నిరసనగా టాగూర్‌ నోబెల్‌నే వెనక్కు ఇచ్చారని చెప్పడం విమర్శలకు దారితీసింది. విప్లవ్‌ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో సరదా వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి.
 

మరిన్ని వార్తలు