బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లండి

10 Mar, 2016 01:14 IST|Sakshi

బీజేపీ ఎంపీలకు పార్టీ అధిష్టానం ఆదేశం
 న్యూఢిల్లీ: త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో... బీజేపీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, తాజా కేంద్ర బడ్జెట్‌లో అన్ని వర్గాలకు ప్రయోజనాలు ఉన్నాయని వారికి వివరించాలని తమ ఎంపీలకు పార్టీ అధిష్టానం ఆదేశించింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సీనియర్ నేతలు ఎంపీలకు సూచనలు చేశారు. భేటీ అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు.

ఎంపీలు ప్రస్తుత బడ్జెట్‌లోని పథకాలు, క్షేత్రస్థాయిలో ప్రయోజనం కలిగించే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సూచించారని చెప్పారు. ముఖ్యంగా ‘సబ్‌కా సాత్-సబ్‌కా వికాస్’లో ప్రజలంతా భాగస్వాములయ్యేలా అవగాహన కల్పించాలని, ‘ప్రధాని ఫసల్ బీమా యోజన, ముద్రా బ్యాంక్, గ్రామీణ విద్యుదీకరణ పథకం, జన్‌ధన్ యోజన’లను విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు