తలాక్‌పై ఏమంటారు?

2 Mar, 2016 01:37 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇస్లాం మతం ప్రకారం తలాక్ చెప్పి విడాకులిచ్చే సాంప్రదాయాన్ని, నిఖా హలాలాను  మార్పులు చేసే విషయంపై అభిప్రాయం చెప్పాలంటూ సుప్రీం కోర్టు మంగళవారం కేంద్రాన్ని కోరింది. ముస్లిం వ్యక్తి తన భార్యకు విడాకులిచ్చేందుకు తలాక్ అని మూడుసార్లు చెబితే సరిపోతుంది. తన భర్త  హింసించాడని, వరకట్న వేధింపులకు గురిచేసిందని.. మూడుసార్లు తలాక్ చెప్పి వదిలించుకున్నారంటూ షాయరా బానో అనే ముస్లిం మహిళ వేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. మానసికంగా, శారీరకంగా కుంగిపోయిన ఆ మహిళ.. ముస్లిం పర్సనల్ లా సెక్షన్‌ను ప్రశ్నిస్తూ కోర్టును ఆశ్రయించింది. ఈమె ఫిర్యాదుపై స్పందించిన ధర్మాసనం.. దీనిపై వివరణ ఇవ్వాలని మైనారిటీ వ్యవహారాల శాఖను ఆదేశించింది.

>
మరిన్ని వార్తలు