తలాక్‌’లో న్యాయ అంశాలనే పరిశీలిస్తాం

15 Feb, 2017 01:26 IST|Sakshi

తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ముస్లింల ట్రిపుల్‌ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం విషయంలో న్యాయ సంబంధమైన అంశాలను మాత్రమే పరిశీలిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ముస్లిం చట్టాల ప్రకారం విడాకులు పొందితే దానిపై కోర్టులు పర్యవేక్షణ ఉండాలనే దానిని తాము పరిశీలించబోమని, అది శాసన సంబంధమైనదని మంగళవారం తెలిపింది. పిటిషనర్లకు సంబంధించిన న్యాయవాదులు భేటీ అయి తాము పరిశీలించాల్సిన అంశాలను ఖరారు చేయాలని, ఆ అంశాలను నిర్ణయించడానికి గురువారం విచారణ జాబితాలో చేర్చుతున్నామని చీఫ్‌ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్, జస్టిస్‌ ఎన్ వీ రమణ, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

అయితే ట్రిపుల్‌ తలాక్‌ బాధి తులకు సంబంధించిన సంక్షిప్త ఉదాహ రణలు సమర్పించడానికి కోర్టు అనుమతిం చింది. ముస్లిం సంప్రదాయాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పలు పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. రాజ్యాం గంలోని లింగసమానత్వం హక్కుపై తొలుత చర్యలు తీసుకోవాలని కేంద్రానికి తెలిపింది. ట్రిపుల్‌ తలాక్, బహుభార్యత్వాలను వ్యతిరేకిస్తూ కేంద్రం వాటిని పరిశీలించాలని కోర్టును కోరిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు