పశు, మత్స్యశాఖలకు నిధులు పెంచుతాం

31 Jan, 2017 04:33 IST|Sakshi

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌  
సాక్షి, హైదరాబాద్‌: వచ్చే బడ్జెట్‌లో పశు, మత్య్స శాఖలకు భారీగా నిధులు కేటాయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ శాఖలు ఎంతో ప్రాధాన్యత కలిగినవిగా గుర్తింపు సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సచివాలయంలో తెలంగాణ నాన్  గెజిటెడ్‌ వెటర్నరీయన్స్ అసోసియేషన్  డైరీని సోమవారం ఆయన ఆవిష్కరించారు.

మంత్రి మాట్లాడుతూ.. పశుసంవర్థక, మత్స్యశాఖల అభివృద్ధికోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఈ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి తెలిపారు. 161 మంది వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్ లను నియమించామని, త్వరలో మరో 180 మంది నియామకం చేపట్టనున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు