85 కిలోమీటర్లు 38 నిమిషాల్లో ముగించింది

14 Jul, 2016 14:29 IST|Sakshi
85 కిలోమీటర్లు 38 నిమిషాల్లో ముగించింది

మధుర: భారతీయ రైల్వేలో ఇప్పటి వరకు ఉన్న అత్యధిక వేగాన్ని స్పెయిన్ నుంచి తీసుకొచ్చిన టాల్ గో ట్రైన్ అధిగమించింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ రైలు మధుర-పాల్వాల్ మధ్య ప్రయాణాన్ని 38 నిమిషాల్లో ముగించింది. రెండోసారి నిర్వహించిన ఈ ట్రయల్ లో ఇప్పటి వరకు భారత్ లో అత్యధిక వేగంగా వెళ్లే గతిమాన్ (గంటకు 160 కిలోమీటర్ల వేగం) రికార్డును ఇది చెరిపివేసింది.

స్పెయిన్ నుంచి ఉత్తర మధ్య రైల్వే విభాగం ఈ రైలును దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ రైలు పనితీరుపై ట్రయల్స్ వేస్తున్నారు. అందులో భాగంగా రెండుసార్లు ఖాళీ రైలుతో ట్రయల్ వేశారు. మరికొన్నిసార్లు ఇసుక బస్తాలు వేసి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ టాల్గోఘో మోస్తరు వేగం గంటకు 160 నుంచి 250 కిలో మీటర్లు ఉండగా.. అత్యధిక వేగం 350 కిలోమీటర్లు ఉండనుంది.

మరిన్ని వార్తలు