తాల్గో రైలు వేగం@115

30 May, 2016 06:45 IST|Sakshi
తాల్గో రైలు వేగం@115

ట్రయల్ రన్ నిర్వహించిన రైల్వే శాఖ
 
 బరేలీ: దేశంలో రైళ్ల వేగాన్ని పెంచే వ్యూహంలో భాగంగా రైల్వే శాఖ స్పెయిన్ తయారీ తాల్గో రైలు తొలి ట్రయల్ రన్‌ను నిర్వహించింది. ఈ రైలు తేలికగా ఉండటంతోపాటు గంటకు 115 కి.మీ వేగంతో పరుగులు తీయగలదు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నుంచి మొరాదాబాద్ వరకు తాల్గో రైలు ట్రయల్ రన్‌ను సాఫీగా నిర్వహించారు. 4,500 హెచ్‌పీ సామర్థ్యమున్న డీజిల్ ఇంజన్‌కు 9 తాల్గో బోగీలను తగిలిం చారు. బరేలీలో ఉదయం 9.05 గంటలకు బయలుదేరిన ఈ రైలు 10.15 గంటలకు మొరాదాబాద్ చేరింది. గంటకు 110-115 కి.మీ వేగంతో 90 కి.మీ. దూరాన్ని 70 నిమిషాల్లో చేరిందని అధికారులు చెప్పారు.

ప్రస్తుతం ఢిల్లీ-ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ సగటు వేగం గంటకు 85 కి.మీ. ఉంది. తాల్గో రైళ్లు తేలిగ్గా ఉండటం వల్ల 30 శాతం ఇంధనాన్ని ఆదాచేస్తుంది. 9 బోగీల్లో రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్, నాలుగు చైర్ కార్లు, కేఫెటేరియా, పవర్ కార్, సిబ్బంది-పరికరాలున్న బోగీలున్నాయి. ఒక్క ట్రయల్న్‌త్రోనే దీనిపై అంచనాకు రాలేమని, ఇంకా మూడుసార్లు నిర్వహిస్తామని రైల్వే శాఖ పరిశోధన డిజైన్లు, ప్రమాణాల సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ హమీద్ అఖ్తర్ చెప్పారు. తర్వాత మథుర-పల్వాల్ మార్గంలో 40 రోజులపాటు 180 కి.మీ. వేగంతో ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు.తాల్గో కంపెనీ సెమీ-హైస్పీడ్ (గంటకు 160-250 కి.మీ.), హైస్పీడ్ (350 కి.మీ.) ప్యాసింజర్ రైళ్లను తయారుచేస్తుంది.
 

మరిన్ని వార్తలు