సంయమనం పాటించండి: హోం మంత్రి

25 May, 2018 08:48 IST|Sakshi
రాజ్‌నాథ్‌సింగ్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ: తూత్తుకుడిలో ప్రజలు సంయమనం పాటించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్టెరిలైట్‌ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసనలో పోలీసుల కాల్పుల్లో ఇప్పటి వరకు 11 మంది నిరసనకారులు మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం కూడా ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ తమిళనాడు ప్రజలు శాంతి, సంయమనం పాటించాలని కోరారు.

‘స్టెరిటైట్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో అమాయక ప్రజలు చనిపోవడం దురదృష్టకరం. వారి అత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్న. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న’ అని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ గురువారం వ్యాఖ్యానించారు. కాగా నిరసనకారులపై కాల్పులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష డీఎంకేతో సహా ఇతర పక్షాలు శుక్రవారం తమిళనాడు బంద్‌కు పిలుపినిచ్చాయి.

మరిన్ని వార్తలు