కరోనా ఎఫెక్ట్‌: తమిళనాడు కీలక నిర్ణయం

6 Jun, 2020 17:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెన్నై: తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 30,152 నమోదయిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌ ఆస్పత్రులలో కరోనా వైరస్ చికిత్సకు నిర్ణీత ధరలను నిర్ణయించింది. కరోనా లక్షణాలు లేని వారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారిని ఏ1, ఏ2 కేటగిరీలుగా ప్రభుత్వం వర్గీకరించింది. ఏ1,ఏ2 కేటగిరి రోగుల చికిత్స కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులు రూ.7500 ఫీజును వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

ఏ3, ఏ4 కేటగిరి జనరల్‌ వార్డు రోగుల నుంచి రూ.5000 ఫీజును వసూలు చేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. కాగా ఏ1, ఏ2, ఏ3, ఏ4 కేటగిరీలకు సంబంధించి ప్రైవేట్ ఆస్పత్రులలో ఐసీయూ విభాగానికి మాత్రం రూ.15000 వసూలు చేసుకోవచ్చని తెలిపింది. కరోనా చికిత్సకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని బాధితుల ఫిర్యాదుతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. తమిళనాడుని కరోనా పంజా విసురుతోంది. కాగా, శనివారం ఒక్క రోజే 1,458 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. ఇంత వరకు 251మంది కరోనాతో చనిపోయారు.

చదవండి: భారత్‌లో అమెరికా కంటే ఎక్కువ కేసులు: ట్రంప్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా