మహిళా జర్నలిస్ట్‌ పై మంత్రి వ్యాఖ్యలు

17 Mar, 2018 02:19 IST|Sakshi
తమిళనాడు ఆరోగ్యమంత్రి సి.విజయభాస్కర్‌

మహిళా విలేకరిపై తమిళనాడు మంత్రి వ్యాఖ్యలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ఆరోగ్యమంత్రి సి.విజయభాస్కర్‌ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ గురువారం నిర్వహించిన సమావేశానికి హాజరైన విజయభాస్కర్‌ బయటికొస్తుండగా.. భేటీలో తీసుకున్న నిర్ణయాల విషయమై ఓ మహిళా జర్నలిస్ట్‌ ఆయనను ప్రశ్నించారు. దీంతో ప్రశ్నల్ని తప్పించుకునేందుకు ‘మేడమ్‌ మీరు కళ్లద్దాల్లో చాలా అందంగా ఉన్నారు’ అని విజయభాస్కర్‌ వ్యాఖ్యానించారు. తానెప్పుడూ కళ్లద్దాలు ధరిస్తానన్న ఆమె సమావేశంలో పార్టీ నిర్ణయాలపై మళ్లీ మంత్రిని ప్రశ్నించింది. దీంతో విజయభాస్కర్‌ ‘మీరు ఈరోజు చాలా అందంగా ఉన్నారు’ అని జవాబిచ్చారు.

సమావేశం విషయమై పార్టీ త్వరలోనే ప్రకటన విడుదల చేస్తుందనీ, దీనిపై అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు మాట్లాడతారని స్పష్టం చేశారు. అయినా ఆ మహిళా జర్నలిస్ట్‌ ప్రశ్నలు అడగటం మానకపోవడంతో ‘మీరు చాలా అందంగా ఉన్నారు’ అని మంత్రి మరోసారి చెప్పారు. తన వ్యాఖ్యలపై తీవ్రదుమారం చెలరేగడంతో విజయభాస్కర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రశ్నల్ని తప్పించుకునే క్రమంలోనే తానలా అన్నట్లు చెప్పారు. వ్యాఖ్యలు ఆమెను బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నానన్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా