వృద్ధురాలి మెడపై కరిచిన కరోనా క్వారంటైన్‌ వ్యక్తి

29 Mar, 2020 07:22 IST|Sakshi

థెని: తమిళనాడులో ఘాతుకం చోటుచేసుకుంది. శ్రీలంకలో బట్టల వ్యాపారం చేసే ఓ వ్యక్తి స్వస్థలానికి తిరిగి వచ్చి వృద్ధురాలి (90) మెడపై కొరికాడు. ఆమెను ఆస్పత్రిలో చేర్చినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అధికారుల కథనం ప్రకారం.. శ్రీలంకలో   బట్టలు అమ్ముకునే వ్యక్తి శుక్రవారం భారత్‌లోకి వచ్చాడు. కరోనా నేపథ్యంలో అతన్ని హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. అయితే, జక్కమనయకంపట్టిలోని తన ఇంట్లోకి వచ్చిన వెంటనే నగ్నంగా వీధిలోకి పరుగెత్తాడు. ఆ వీధిలో ఉన్న ఓ వృద్ధురాలి  మెడపై కొరికాడు. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె శనివారం మరణించిందని వైద్యులు తెలిపారు. (జిత్తుల మారి వైరస్‌)

మరిన్ని వార్తలు