రాజ్‌భవన్‌లో 84 మంది సిబ్బందికి కరోనా

23 Jul, 2020 13:13 IST|Sakshi

సాక్షి, తమిళనాడు: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇక తమిళనాడులో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య బుధవారం ఏకంగా ఆరు వేలకు సమీపంగా చేరింది. తాజగా గురవారం రాజ్‌భవన్‌లో 84 మంది సిబ్బందికి కరోనా పాటిజిట్‌గా నిర్ధారణ అయింది. 147 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 84 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో సెక్యూరిటీ, ఫైర్‌ సిబ్బంది ఉన్నారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇక బుధవారం నిర్థారణ అయిన కరోనా పాజిటివ్‌ కేసుల జాబితాలో మరో ఎమ్మెల్యే చేరిపో​యారు. దీంతో కరోనా బారినపడిన నలుగురు మంత్రులతోకలుపుకొని ఎమ్యెల సంఖ్య 17కు చేరుకుంది. రాష్ట్రం లో మొత్తం కరోనా కేసులు సంఖ్య 186492 కేసలు నమోదు కాగా, 51765 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటికే 131583 మంది కరోనా నుంచి డిశ్చార్జ్‌ కాగా, 3144 మంది మృతి చెందారు. ఇక బుధవారం ఒక్కరోజే ఏకంగా 5849 కేసుల నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు