దళిత మహిళకు సీటు.. ఎన్నికల బహిష్కరణ

28 Dec, 2019 02:21 IST|Sakshi

చెన్నై: కుల వివక్ష నేటికీ కొనసాగుతోందనడానికి ఉదాహరణగా నిలిచారు తమిళనాడుకు చెందిన తూత్తుకుడి గ్రామస్తులు. అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్‌ కోసం శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో దళిత మహిళకు సీటు కేటాయించడంతో నాడార్‌ కులానికి చెందిన వారు ఏకంగా ఆ ఎన్నికలనే బహిష్కరించారు. పిచ్చావిళై గ్రామంలో 785 ఓటర్లలో ఆరుగురు దళితులు పంచాయతీ ప్రెసిడెంట్‌ కోసం నిర్వహించిన ఎన్నికల్లో ఓటు వేశారు. నాడార్‌ కులానికి చెందిన మిగతా 779 మంది ఓటర్లు ఎన్నికల్లో ఓటు వేయకుండా వారి ఇళ్ల ముందు నల్లటి జెండాలను ఉంచి నిరసనలను తెలిపారు. తాలూకా అధికారి వారిని ఓటు వేయాలని కోరినప్పటికీ వారు దాన్ని పెడచెవిన పెట్టి బహిష్కరించారు. ‘సీట్ల కేటాయింపు న్యాయంగా లేదు. మేం ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మాకు నచ్చిన అభ్యర్థిని ఉంచడానికి అనుమతించలేదు. అందుకే మేం ఎన్నికలను బహిష్కరించాం’అని మడిసుదు అనే స్థానికుడు తెలిపారు.

మరిన్ని వార్తలు