ఆస్పత్రిలో చేరిన తమిళనాడు మాజీ సీఎస్

24 Dec, 2016 10:23 IST|Sakshi
ఆస్పత్రిలో చేరిన తమిళనాడు మాజీ సీఎస్

చెన్నై: తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) పి.రామ్మోహన్‌రావు అస్వస్థతకు లోనయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయనను చెన్నైలోని రామచంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రామ్మోహన్‌రావుకు ఐసీయూలో చికిత్స కొనసాగుతుందని సమాచారం. కాగా ఇటీవల ఐటీ అధికారుల జరిపిన దాడుల్లో ఆయన అవినీతి బండారం బటయపడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసి ఆయన స్థానంలో గిరిజా వైద్యనాథన్‌కు బాధ్యతలు అప్పగించిన విషయం విదితమే.

మాజీ సీఎం జయలలిత హయాంలో సీఎస్‌గా నియమితులైన రామ్మోహనరావు, ఆయన కుమారుడు వివేక్ రావు, మరికొందరి ఇళ్ల నుంచి మొత్తం రూ. 30 లక్షల కొత్త 2వేల నోట్లు, 5 కిలోల బంగారం, మరో 5 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి అనారోగ్యానికి గురైన రామ్మోహన్ రావు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు