‘మా రాష్ట్రంలో వద్దు.. మరోసారి ఆలోచించండి’

22 May, 2020 13:47 IST|Sakshi

చెన్నై :  దేశీయ విమాన‌యాన స‌ర్వీసులు సోమ‌వారం నుంచి ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో మే 31 వ‌ర‌కు రాష్ట్రంలో విమాన‌యాన స‌ర్వీసులకు అనుమ‌తించ‌రాదంటూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం శుక్ర‌వారం కేంద్రాన్ని కోరింది. భార‌త్‌లో అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న రాష్ట్రాల్లో త‌మిళ‌నాడు కూడా ఒక‌టి. పెరుగుతున్న క‌రోనా కేసుల దృష్ట్యా విమాన‌యానానికి అనుమ‌తించ‌రాదంటూ కోరింది. అయితే సోమ‌వారం నుంచి అన్ని దేశీయ విమాన‌యాన స‌ర్వీసుల‌కు అనుమ‌తిచ్చిన నేప‌థ్యంలో త‌మిళ స‌ర్కార్ చేసిన విఙ్ఞ‌ప్తిపై కేంద్రం నుంచి  ఎలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. (విమానయానం.. కొత్త కొత్తగా...)

ఈ నెల ప్రారంభంలో విదేశాల్లో చిక్కుకున్న356 మంది  భార‌తీయుల‌ను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల్లో చైన్నై విమానాశ్ర‌యానికి తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే వారిలో కొంత‌మంది ప్ర‌యాణికులకు క‌రోనా నిర్థార‌ణ అయ్యింది. గ‌త కొన్ని రోజులుగా కోయంబేదుకు హోల్‌సేల్ మార్కెట్ నుంచి అనూహ్యంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా రెండ‌వ అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న రాష్ర్టంగా త‌మిళ‌నాడు ఉంది. ఈ నేప‌థ్యంలో విమానాయానానికి అనుమ‌తిస్తే రాష్ర్టంలో మ‌రిన్ని క‌రోనా కేసులు పెర‌గ‌డానికి ఆస్కారం ఉంద‌ని కేంద్రానికి విన్నవించుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు  త‌మిళ‌నాడులో 13,000 క‌రోనా కేసులు న‌మోదుకాగా, 95 మంది ప్రాణాలు కోల్పోయారు. (దేశంలో ఒక్కరోజే 6088 కరోనా కేసులు )


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా