ఆమెకు కులం, మతం లేదు!

14 Feb, 2019 21:02 IST|Sakshi

పొద్దున లేస్తే చాలు కుల, మత, వర్గ రహిత సమాజం కావాలంటూ లెక్చర్లు దంచే ‘మహానుభావుల’ను చాలా మందినే చూస్తుంటాం. అందులో ఎంత మందికి నిజంగా సమసమాజ స్థాపన పట్ల చిత్తశుద్ధి ఉందని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం చాలా కష్టం. అయితే తమిళనాడుకు చెందిన స్నేహ అనే న్యాయవాది మాత్రం ఇందుకు మినహాయింపు. మాటలకు పరిమితమై పోకుండా ఏళ్ల పాటు కృషి చేసి.. ‘నో కాస్ట్‌, నో రిలిజియన్‌’ సర్టిఫికెట్‌ సంపాదించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారామె. ఎవరి హక్కులనో ప్రశ్నించేందుకు తాను ఈ సర్టిఫికెట్‌ పొందలేదని.. భవిష్యత్‌ తరాలకు కుల, మత రహిత సమాజాన్ని అందించే మహత్కార్యంలో తనకున్న బాధ్యతను ఈ విధంగా నెరవేర్చుకున్నానన్న ఆమె వ్యక్తిత్వం అందరికీ ఆదర్శనీయం.

బుధవారం సాయంత్రం నుంచి స్నేహ (35), ఆమె భర్త పార్తీబ రాజా ఫోన్‌ మోగుతూనే ఉంది. కొం‍దరు స్నేహకు శుభాకాంక్షలు చెబుతుంటే.. మరికొంత మంది మాత్రం స్నేహలాగే తాము కూడా కుల, మతరహిత సమాజంలో భాగస్వామ్యం కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ‘నో కాస్ట్‌, నో రిలిజియన్‌’ సర్టిఫికెట్‌ పొందాడానికి అనుసరించాల్సిన విధానాల గురించి అడుగుతూ సందేహాలు తీర్చుకుంటున్నారు.

గర్వంగా ఉంది...
ఈ విషయం గురించి స్నేహ మాట్లాడుతూ... ‘నా జీవితంలోని ముఖ్య లక్ష్యం ఒకటి నెరవేరింది. నా తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్ల ప్రభావంతో చిన్ననాటి నుంచే నాలో కుల, మతాలకతీతంగా ఉండాలనే కోరిక బలపడింది. అనేక అవాంతరాల అనంతరం ఈ రోజు నా చేతిలో నో కాస్ట్‌, నో రిలిజియన్‌ సర్టిఫికెట్‌ ఉంది. అలా అని నేను రిజర్వేషన్‌కు వ్యతిరేకం కాదు. రిజర్వేషన్‌ విధానాన్ని సమర్థిస్తాను. వెనుకబడిన వర్గాలు అభివృద్ధి చెందేందుకు ఇలాంటివి అవసరం. అయితే ఇందుకు కులమో, మతమో ప్రామాణికం కాకూడదు. ఈ సర్టిఫికెట్‌ పొందడం ద్వారా ఎవరి హక్కులను లాక్కోవడం లేదు. సమాజ శ్రేయస్సు కోసం, వివక్షకు గురవుతున్న వ్యక్తుల హక్కులను కాపాడాలని ప్రతీ ఒక్కరికీ విఙ్ఞప్తి చేస్తున్నా. ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తుంటే 2017 నుంచి నాకు సానుకూలత లభించింది. ఇప్పుడు సర్టిఫికెట్‌ వచ్చింది. చాలా గర్వంగా ఉంది. కాస్ట్‌ సర్టిఫికెట్‌ ఫార్మాట్‌లోనే నా సర్టిఫికెట్‌ రూపొందించమని అడిగాను’  అని తిరుపత్తూరు తహశీల్దార్‌ టీఎస్‌ సత్యమూర్తి నుంచి నో కాస్ట్‌, నో రిలిజియన్‌ సర్టిఫికెట్‌ అందుకున్న స్నేహ తన ఉద్దేశాన్ని తెలియజేశారు.

తండ్రి చూపిన బాటలో...భర్త ప్రోత్సాహంతో
స్నేహ స్వస్థలం వేలూరు జిల్లాలోని తిరుపత్తూరు. ఆమె తండ్రి కుల, మతాలకు వ్యతిరేకం. అందుకే తన ముగ్గురు కూతుళ్లకి స్నేహ, ముంతాజ్‌, జెన్నిఫర్‌ అనే పేర్లు పెట్టారు. తండ్రి ప్రభావంతో స్నేహ కూడా తన సంతానానికి వివిధ మతాచారాలకు సంబంధించిన పేర్లు పెట్టారు. ఈ విషయంలో స్నేహ భర్త పార్తీబ రాజా ఆమెకు పూర్తి మద్దతుగా నిలిచారు.

తన పెద్ద కుమార్తెకు ‘అధిరై నస్రీన్‌’ అనే బుద్ధిస్టు, ముస్లిం సంప్రదాయాల కలయికకు చెందిన పేరు పెట్టడం గురించి పార్తీబ రాజా మాట్లాడుతూ.. ‘ కుల, మత రహిత సమాజం గురించి ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకే మా కూతురికి ఈ పేరు పెట్టాం. తన పేరు వినగానే ప్రతీ ఒక్కరూ మీ అమ్మానాన్నలు ముస్లింలా అని అడుగుతారు. అప్పుడు మా కూతురు మా ఇద్దరి పేర్లు చెప్పడంతో పాటుగా తనకు ఆ పేరు పెట్టడానికి గల కారణాలు, తన పేరు వెనుక ఉన్న కథను వివరిస్తుంది. ఈ రకంగా వారికి అవగాహన కలుగుతుంది. ప్రసుతం స్నేహ నో కాస్ట్‌, నో రిలిజియన్‌ సర్టిఫికెట్‌ పొందడం ఒక సానుకూల దృక్పథానికి నాంది. ఈ విషయం గురించి చర్చ మొదలైంది. చాలా మంది తమకు కూడా ఇలాంటి సర్టిఫికెట్‌ కావాలని అడుగుతున్నారు. బహుశా దేశంలోనే ఇలాంటి సర్టిఫికెట్‌ పొందిన తొలి మహిళ తనేనేమో. ప్రస్తుతం ఆమె సోదరీమణులు కూడా తన బాటలోనే నడిచే ప్రయత్నం చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు.

ప్రశంసల జల్లు
నో కాస్ట్‌, నో రిలిజియన్‌ సర్టిఫికెట్‌ పొందడం ద్వారా స్నేహ రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘భారతీయుల్లో నిగూఢంగా ఉండే కోరికను మీరు నెరవేర్చుకున్నారు. మనకు అనవసరమైన, సంబంధం లేని విషయాలను త్యజిద్దాం. కులాన్ని పక్కన పెట్టేద్దాం’ అంటూ లోకనాయకుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత, కమల్‌హాసన్‌ ట్వీట్‌ చేశారు. అదేవిధంగా సినీ నటుడు సత్యరాజ్‌, నటి, హక్కుల కార్యకర్త రోహిణి స్నేహను ప్రశంసించారు.
-సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్‌
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మళ్లీ సోనియాకే పార్టీ పగ్గాలు’

కుప్పకూలిన భవనం : శిథిలాల కింద..

ఐఏఎఫ్‌లో చేరనున్న అమర జవాన్‌ భార్య

కేంద్ర మంత్రులపై మోదీ ఆగ్రహం

ప్రజలకు అది పెద్ద సమస్య.. దృష్టి పెట్టండి : మోదీ

14 మంది ఉగ్రవాదులకు రిమాండ్‌

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ అరెస్ట్‌

డ్రైవింగ్‌ లైసెన్స్‌కు ‘ఆధార్‌’ ఆపేశాం

‘ఆయనేం దేవుడు కాదు; రూల్స్‌ చదువుకుంటే మంచిది’

ఐదేళ్ల చిన్నారిపై కీచకపర్వం

పెళ్లి వేడుకకూ పరిమితులు

‘హిమాచల్‌’ మృతులు14

గవర్నర్‌ కీలుబొమ్మా?

‘కోట్ల’ కర్నాటకం

ఇంజనీరింగ్‌లో ఆ కోర్సులకు సెలవు

రోడ్డు ప్రమాదంలో మరణిస్తే 5 లక్షలు

18న బలపరీక్ష

ఎన్‌ఐఏకి కోరలు

చంద్రయాన్‌–2 ఆగడానికి కారణమిదే

ప్రశాంత్‌ కిషోర్‌ చేతిలో ఠాక్రే వారసుడు

అక్కాచెల్లెల్ని బంధించి రెండు నెలలుగా..

చెన్నైలో భారీ వర్షం

గవర్నర్‌ ఒక కీలుబొమ్మ.. అవునా?

‘నేను పెద్ద తప్పు చేశా.. ఇండియాకు వచ్చేస్తున్నా’

ఈనాటి ముఖ్యాంశాలు

రాజస్తాన్‌​ హైకోర్టులో ఆ పదాలు నిషేధం

సిద్ధూ రాజీనామాపై తుది నిర్ణయం నాదే..

ఎన్‌ఐఏ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ముస్లింలు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

అదే నా ప్లస్‌ పాయింట్‌