టార్గెట్‌ ఎవరెస్ట్‌

21 May, 2017 03:48 IST|Sakshi
టార్గెట్‌ ఎవరెస్ట్‌

  తొమ్మిదేళ్ల విశాఖ చిన్నారి అరుదైన ఘనత
తల్లితో కలసి ఎవరెస్టు బేస్‌ క్యాంపునకు చేరుకున్న కామ్య కార్తికేయన్‌


సాక్షి, విశాఖపట్నం:
సంకల్ప బలం ముందు శిఖరాలు సైతం తలొంచాల్సిం దేనని తొమ్మిదేళ్ల చిన్నారి నిరూపించింది. విశాఖకు చెందిన కామ్య కార్తికేయన్‌ రోజుకు 9 గంటల పాటు నడిచి.. 9 రోజుల్లోనే ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌నకు(18,000 అడుగులు) చేరు కుంది. తద్వారా ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో బాలికగా రికార్డు సృష్టించింది. బాలిక తండ్రి కార్తికేయన్‌ తూర్పు నావికాదళ అధికారి, తల్లి లావణ్య ఉపాధ్యాయురాలు. కామ్య కార్తికేయన్‌ ప్రస్తుతం నేవీ చిల్డ్రన్స్‌ స్కూల్‌లో ఆరో తరగతి చదువు తోంది. చిన్నప్పట్నుంచీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పర్వతా రోహణలో మెళకువలు నేర్చుకున్న కామ్య మూడేళ్ల వయసులోనే సహ్యాద్రి కొండలు ఎక్కేసింది. 2015లో ఒకసా రి, 2016లో 3సార్లు హిమాలయాల్లో భాగమైన చంద్రశిల (13 వేల అడుగు లు), హర్కిధమ్‌ (13,500 అడుగులు), రూప్‌ ఖండ్‌ లేక్‌ (16,499 అడుగులు)ను అధిరోహిం చింది. ఇప్పుడు ఏకంగా ఎవ రెస్ట్‌ బేస్‌ క్యాంప్‌పై త్రివర ్ణ పతాకాన్ని ఎగురవేసింది. దేశంలో  ఇంత చిన్న వయ సులో ఎవరూ ఈ ఘనతను సాధించలేదు. దీంతో  జాతీ య రికార్డు కూడా  కామ్య సొంతమైంది.

సవాళ్లు ఎదుర్కోవడం నేర్పాలి
కామ్య తల్లి లావణ్య ‘సాక్షి’ తో మాట్లాడుతూ.. ‘మా ప్రయాణం నేపాల్‌లోని లుక్లా నుంచి ప్రారంభమైంది. రోజుకు 9 గంటలు నడవాలని నిర్ణయించుకున్నాం. పిల్లలకు సవాళ్లను ఎదుర్కోవడం చిన్నప్పట్నుంచే నేర్పాలనే ఉద్దేశంతో కష్టమైనా తనకి నచ్చిన మార్గంలో ప్రోత్స హిస్తున్నాం..’ అని చెప్పారు.

నా తండ్రి కలను సాధిస్తా..
కామ్య మాట్లాడుతూ.. ‘ఎవరెస్ట్‌ ఎక్కాలనేది నా తండ్రి కల. దానిని నేను సాధించాలనుకుంటున్నాను. ఇప్పటివరకు 18వేల అడుగులకు చేరుకున్నా ను. ఇకపై ఎక్కాలంటే దానికి ప్రత్యేక శిక్షణ అవసరం. 14 ఏళ్లు పూర్తయితేనే ఎవరెస్ట్‌ ఎక్కేందుకు అనుమతిస్తారు. అర్హత సాధించగానే ఎవరెస్ట్‌పై కాలుపెడతాను..’ అని పేర్కొంది.

మరిన్ని వార్తలు