టాటూ ఉంటే ఉద్యోగం పోయినట్టే

29 Jan, 2018 03:11 IST|Sakshi
టాటూ

న్యూఢిల్లీ: శరీరంపై శాశ్వతంగా ఉండే టాటూ వేయించుకున్న వారు తమ విభాగంలో ఉద్యోగాలకు అనర్హులంటూ ఎయిర్‌ఫోర్స్‌ విధించిన నిబంధనను న్యాయస్థానం సమర్థించింది. టాటూ ఉందన్న కారణంతో తనను అనర్హుడిగా ప్రకటించారంటూ ఓ యువకుడు వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. సదరు అభ్యర్థి ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్న మేరకు తన శరీరంపై ఉన్న టాటూ ఫొటోను జత చేయలేదని ఈ సందర్భంగా ఎయిర్‌ఫోర్స్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఆచారాలు, సంప్రదాయాల మేరకు టాటూలు వేయించుకునే గిరిజన అభ్యర్థులకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. కాగా, ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్న నిబంధనలకు లోబడే ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటూ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. 

మరిన్ని వార్తలు