తరగతి గదిలో నీలి చిత్రాలు: టీచర్ అరెస్ట్

12 Dec, 2014 17:01 IST|Sakshi
తరగతి గదిలో నీలి చిత్రాలు: టీచర్ అరెస్ట్

మధుర: స్కూల్ పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచరే ప్రక్కదోవ పడితే ఇక పిల్లల భవిష్యత్తు ఏమిటి?,  పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టాల్సిన  టీచర్ తాను తప్పుదోవ పట్టడమే కాకుండా పిల్లలను కూడా వక్రమార్గంలో పయనించేటట్లు చేస్తే ఇక చేసేదేముంది.  ఓ టీచర్ పాఠాలు పక్కకు పెట్టి పిల్లలకు నీలి చిత్రాలు చూపిస్తున్న ఘటన మధురలోని తక్షశిల పబ్లిక్ స్కూల్ లో చోటు చేసుకుంది.

ఆ స్కూల్ ప్రిన్సిపాల్ పని మీద బయటకు వెళ్లిన సమయంలో అదే అదనుగా భావించిన టీచర్ జితేంద్ర గౌతమ్ తన సెల్ ఫోన్ లో ఉన్న బ్లూ ఫ్లిల్మ్ లను పిల్లలకు చూపెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు.  ఈ విషయాన్ని పిల్లలు తమ తల్లి దండ్రుల వద్దకు తీసుకువెళ్లగా ఆ టీచర్ ను  పట్టుకుని చితకబాదారు. అనంతరం ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఊర్మిలా శర్మ ఫిర్యాదు మేరకు కీచక టీచర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు