స్కూల్‌లో 'ఆశారాం చాలిసా' పఠనం..!

20 Dec, 2015 09:21 IST|Sakshi
స్కూల్‌లో 'ఆశారాం చాలిసా' పఠనం..!

జైపూర్‌: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపిన కేసులో ప్రస్తుతం ఆయన జోథ్‌పూర్‌ జైల్లో ఉన్నాడు. అయినా ఆయనను ఆరాధించడం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మానుకోలేదు. తనను తను 'దేవుడి ప్రతిరూపం'గా చెప్పుకొనే ఆశారాంను ఏకంగా పాఠశాలలో ఆరాధిస్తూ పూజలు చేస్తూ ఆ టీచర్‌ సస్పెండ్‌ అయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బర్మార్‌ జిల్లాలో జరిగింది.

జిల్లాలోని ధోలాదర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌లో మాఘరాం అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. అతను ప్రతిరోజూ బడిలో ప్రార్థన సమయంలో ఆశారాం బాపు ఫొటోను పెట్టి, 'ఆశారాం చాలిసా'ను పఠించేవాడు. విద్యార్థులు కూడా ప్రార్థన చేయకుండా ఈ చాలిసాను పఠించాలని సూచించేవాడు. దీనిపై తోటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయుడు అభ్యంతరం పెట్టినా అతని తీరు మారలేదు. ఈ ఘటన తన దృష్టికి రావడంతో హెడ్మాస్టర్‌ ద్వారా ధ్రువీకరణ చేసుకొని ఆ టీచర్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్టు ప్రాథమిక విద్యాశాఖ సెక్రటరీ కేఎల్‌ మీనా తెలిపారు.

మరిన్ని వార్తలు