జుట్టు రాలిపోతోందని టెకీ ఆత్మహత్య!

2 Jan, 2018 22:00 IST|Sakshi

సాక్షి, మధురైః ప్రస్తుతం మనిషి ఏ చిన్న సమష్యను అధిగమించలేక పోతున్నాడు.  టెక్నాలజీ యుగంలో కూడా జుట్టు రాలిపోతుందని ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.  ఈ విషాద ఘటన తమిళనాడులోని మధురైలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లో వెళితే.. అతని పేరు ఆర్‌.మిథున్ రాజ్. బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. చాలా సంవత్సరాలుగా అతడు హేర్‌ ఫాల్‌ సమస్యతో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. దీంతో అతను కొన్ని రోజులుగా డిప్రెషన్‌కి లోనయ్యాడు.

ఈ విషయాన్ని మధురైలోని జైహిందూపురంలో ఉండే తన తల్లి వాసంతికి పదే పదే చెబుతుండేవాడు. కొడుకుకి పెళ్లి చేయాలని ఆమె ఎన్ని సంబంధాలు చూసినా.. ఫలితం లేదు. దీంతో మిథున్ మరింత కుంగిపోయాడు.  ఈ మధ్య ఉద్యోగానికి సెలవు పెట్టి మధురైకి వచ్చాడు. వాసంతి ఇంట్లో లేని సమయం చూసి ఉరేసుకున్నాడు. స్థానికుల సాయంతో అతన్ని ఆసుపత్రికి తరలించినా.. అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు