బాలీవుడ్ ప్రముఖుల కాల్ రికార్డులు దోచేసి..

15 Jun, 2016 19:40 IST|Sakshi

పేరున్న వ్యాపారవేత్తలు, బాలీవుడ్ స్టార్స్ కాల్ రికార్డులను సేకరిస్తూ పోలీస్ ఐటీ సెల్ విభాగం కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని గుడ్ గావ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. సెలబ్రిటీల కాల్ డేటాలను అందిస్తే ఉద్యోగం చూపుతానన్న వ్యక్తికి ప్రదీప్ కుమార్(30) సమాచారం చేరవేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఆ వ్యక్తి తన ఫేస్ బుక్ అకౌంట్ పేరును దీప్ బురాగా ఉంచినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇరువురి మధ్య దాదాపు 15 మంది సెలబ్రిటీల కాల్ డేటాలు చేతులు మారినట్లు వివరించారు.

ఫోన్ నంబర్లు ఏ సెలబ్రిటీకి చెందినవో కూడా కుమార్ కు తెలియదని, కేవలం ముంబైకు చెందిన వ్యక్తి డేటాను అందించి అప్పుడప్పుడు డబ్బులు తీసుకుంటుంటాడని ఎస్సై సజ్జన్ కుమార్ చెప్పారు. కుమార్ నుంచి ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్, మొబైల్ ఫోన్, ఫేక్ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బిలాస్ పూర్ లోని క్రైమ్ యూనిట్ 6 నుంచి అధికారిక ఈ మెయిల్ ఐడీ ద్వారా కాల్ రికార్డులు కావాలంటూ పంపడంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది.

మరిన్ని వార్తలు