మొదటిసారి బాల నేరస్థుడిపై కొత్త చట్టం అమలు?

6 Feb, 2016 13:56 IST|Sakshi
మొదటిసారి బాల నేరస్థుడిపై కొత్త చట్టం అమలు?

జువనైల్ జస్టిస్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత  తొలిసారి ఓ టీనేజర్‌కు  శిక్షపడే అవకాశం కనిపిస్తోంది. గత డిసెంబర్‌లో సవరించిన బిల్లులో జువనైల్ తీర్పుల విషయంలో 16 ఏళ్ల వయసును ప్రామాణికంగా పరిగణించారు. తీవ్రమైన నేరాలు చేసినప్పుడు ఆ వయసున్న వారిని కూడా పెద్దలుగానే భావించి శిక్ష విధించాలన్నది చట్టం ఉద్దేశం. అయితే ఇంతకుముందు ఓ బాలుడ్ని కిడ్నాప్ చేసి.. చంపిన కేసులో హోంలో శిక్ష అనుభవిస్తూ.. మర్యాదపూర్వక ప్రవర్తనతో హోమ్ నుంచి విడుదలైన బాల నేరస్థుడు... తిరిగి ఓ వృద్ధ మహిళను  హత్య చేశాడు. దీంతో  అతడిపై కొత్త జువైనల్ చట్టం అమలు చేయాలని జువనైల్ జస్టిస్ బోర్డుకు పోలీసులు ఫిర్యాదుచేశారు.   


టీనేజర్‌ను పెద్దవాడిగానే ట్రీట్ చేయాలంటూ జువనైల్ జస్టిస్ బోర్డుకు ఢిల్లీ పోలీసులు అర్జీ పెట్టారు. అతడో మహిళను చంపి కరెక్షన్ హోం నుంచి విడుదలై తిరిగి మరో 13 ఏళ్ల బాలుడ్ని హత్య చేశాడని... అతడిని వయోజనుడిగా భావించాలని కోరారు. బాలుడు పదోతరగతి పరీక్షలు రాయాలంటూ తల్లిదండ్రులు బెయిల్ కు అభ్యర్థించడంతో గతనెలలో అతడి విడుదలకు హోం అంగీకరించింది. అనంతరం నిన్నఢిల్లీ బీకే గుప్తా కాలనీలోని ఓ వృద్ధ మహిళను హతమార్చిన కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసుల అభ్యర్థనను జువనైల్ జస్టిస్ బోర్డు అంగీకరిస్తే అతడు కొత్త చట్టప్రకారం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు