తెహ్రీక్‌-ఈ-తాలిబన్‌ నాయకుడి హతం..

15 Jun, 2018 13:47 IST|Sakshi
మౌలానా ఫజ్లుల్లా (ఫైల్‌ఫోటో)

ఇస్లామాబాద్‌ : పాకిస్తాని తాలిబన్‌ నాయకుడు మౌలానా ఫజ్లుల్లా, శుక్రవారం తూర్పు అఫ్ఘనిస్తాన్‌, కున్రార్‌ రాష్ట్రంలో జరిగిన అమెరికన్‌ డ్రోన్‌ దాడిలో మరిణించినట్లు సమాచారం. ఈ విషయం గురించి అమెరికా సైన్యాధికారి ఒకరు ‘గురువారం మా సైన్యం అఫ్ఘనిస్తాన్‌లో ఉన్న ఒక మిలిటెంట్‌ నాయకుడిని కేంద్రంగా చేసుకుని స్ట్రైక్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా డంగమ్‌ జిల్లా, నౌర్‌ గల్‌ కలాయ్‌ గ్రామంలో తాలిబన్‌ అధ్యక్షుడు ఉన్నట్లు సమాచారం అందింది. దాంతో మా సైన్యం డ్రోన్‌ స్ట్రైక్‌ను చేపట్టింది. ఈ దాడిలో తెహ్రీక్‌-ఈ-తాలిబన్‌ పాకిస్తాన్‌ నాయకుడు మౌలానా ఫజ్లుల్లాతో పాటు మరో నలుగురు టీటీపీ కమాండర్స్‌ను మట్టికరిపింపచా’మని తెలిపాడు.

మౌలానా తన కమాండర్స్‌తో కలిసి ఇఫ్తార్‌ విందుకు హాజరయిన సమయంలో అమెరికన్‌ రిమోట్‌ కంట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ వీరి మీద దాడి చెసిందని తెలిపారు. అయితే అమెరికా నిర్వహించిన డ్రోన్‌ స్ట్రైక్‌లో మరణించింది టీటీపీ నాయకుడు మౌలానానే అని ఆ సంస్థ నుంచి ఇంతవరకూ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మౌలానా టీటీపీ నాకయుడుగా 2013లో బాధ్యతలు చెపట్టాడు. అనంతరం మౌలానా నాయకత్వంలో పాక్‌, అమెరికాలో పలు భయంకర దాడులు జరిగాయి. వీటిల్లో ముఖ్యమైనది 2014లో పెషావర్‌ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో జరిగిన బాంబు దాడి. ఈ దాడిలో 151 మంది మరణిస్తే వారిలో 130 మంది స్కూల్‌ విద్యార్ధులే . మలాలా మీద దాడి చేసిన ఉగ్రవాదుల్లో మౌలానా కూడా ఒకడు.

మరిన్ని వార్తలు