‘బాబాయ్‌ నాకు ఇళ్లు కావాలి’

28 Dec, 2018 12:02 IST|Sakshi

పట్నా : విడాకులు కావాలంటూ రచ్చకెక్కిన బిహార్‌ మాజీ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌.. ఆ తరువాత వేరు కుంపటి పెడతానంటూ మరోసారి వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. అయితే తేజ్‌ ప్రతాప్‌కు ఇంటిని వెతికి పెట్టడంలో ‘చాచా’ నితీష్‌ కుమార్‌ సాయం చేసారంట. అది కూడా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పర్మిషన్‌తో. విడాకుల విషయంలో కుటుంబ సభ్యులతో తలెత్తిన వివాదాల నేపథ్యంలో వేరే ఇంటికి మారాలనుకున్నారు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌. ఆ ప్రయత్నాల్లో భాగంగా తనకు కొత్త ఇంటిని కేటాయించాలంటూ భవన నిర‍్మణాల శాఖ మంత్రికి లేఖ రాశాడు తేజ్‌ ప్రతాప్‌. కానీ వారు సరిగా స్పందించకపోవడంతో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు ఫోన్‌ చేశారు. ‘బాబాయి నాకు ఇళ్లు దొరకడం లేదు సాయం చేయండం’టూ కోరారని సమాచారం.

దాంతో నితీష్‌ కుమార్‌ ఈ విషయం గురించి లాలూ ప్రసాద్‌కు తెలియజేశారు. భార్యభర్తల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగాలంటే.. కొన్నాళ్ల పాటు ఇద్దరూ వేరుగా ఉంటే మంచిదని భావించిన లాలూ.. అందుకు ఒప్పుకున్నారని సమాచారం. లాలూ కూడా ఒప్పుకోవడంతో గతంలో తాను నివసించిన 7 ఎం స్ట్రాండ్‌ రోడ్‌లోని ఇంటిని తేజ్‌ ప్రతాప్‌ కోసం కేటాయించారు నితీష్‌ కుమార్‌. ప్రభుత్వం ది 10, సర్క్యూలర్‌ రోడ్డులోని ఇంటిని మాజీ సీఎం, లాలూ భార్య రబ్రీదేవికి కేటాయించారు. ప్రస్తుతం లాలూ కుటుంబం ఇక్కడే ఉంటున్నారు.

బీజేపీతో పొత్తు కంటే ముందు నితీష్‌ కుమార్‌ మహాకుటమిలో భాగంగా ఆర్జేడీ పార్టీతో పొత్తు పెట్టుకుని బిహార్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. కానీ కొన్ని రోజుల తరువాత మహాకూటమి నుంచి బయటకు వచ్చి, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. .

మరిన్ని వార్తలు