మరోసారి శివుడిగా దర్శనమిచ్చిన మాజీ మంత్రి

31 Jul, 2018 12:34 IST|Sakshi
శివుడి వేషధారణలో ఉన్న తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌

పట్నా : రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ) నాయకుడు, బిహార్‌ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ యువ నేత తన వివాహ సందర్భంగా ఆదిదంపతులు శివపార్వతుల రూపంలో తన ఫోటోలను ప్రింట్‌ చేయించుకుని హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తేజ్‌ మరోసారి శివుడి అవతారాన్ని ధరించారు.

శివాలయంలో పూజలు నిర్వహించడానికి తేజ్‌ ప్రతాప్‌, ఏకంగా శంకరుని వేషధారణలో ఆలయానికి బయలు దేరారు. ఒంటి మీద పులిచర్మం, చేతిలో త్రిశూలం ధరించి డియోఘడ్‌లో ఉన్న బైద్యనాథ్‌ ధామ్‌ ఆలయానికి వెళ్లారు. గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఢమరుకం మోగిస్తూ,  హారతి సమయంలో శంఖాన్ని ఊదుతూ పూజ కొనసాగించారు.

ఈమధ్య తేజ్ ప్రతాప్.. ఓ సైకిల్ యాత్ర చేశారు. అయితే సైకిల్‌ యాత్ర సందర్భంగా ఆయన పట్టు తప్పి కింద పడిపోయారు. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటాన్ని నిరసిస్తూ ఆయన సైకిల్‌ యాత్రను చేపట్టారు. పార్టీ కార్యకర్తలతో కలసి యాత్రను ప్రారంభించిన ఆయన ఒక్కసారిగా స్పీడ్‌ పెంచారు. దాంతో పట్టు కోల్పోయి కింద పడ్డారు.

మరిన్ని వార్తలు