రాహుల్‌ అందుకు అర్హుడే..

27 Jan, 2019 15:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీకి మంచి ప్రధాని కాగలిగే అన్ని అర్హతలున్నాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ అన్నారు. రాహుల్‌ ఓ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ15 ఏళ్లుగా పార్లమెంట్‌లో ఉన్నారనే విషయం మరువరాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి దేశంలో ఐదుగురు సీఎంలున్నారని, వారు రాహుల్‌ నేతృత్వంలో పనిచేస్తున్నారని గుర్తుచేశారు.

రాహుల్‌ ప్రతిష్టను దిగజార్చేందుకు బీజేపీ దుష్ర్పచారం చేస్తోందని తేజస్వి యాదవ్‌ ఆరోపించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరమే ప్రధాని ఎవరన్నది మహాకూటమిలో భాగస్వామ్య పార్టీలు చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు. రాహుల్‌ నాయకత్వంపై ఎలాంటి సందేహాలూ లేవన్నారు. రాహుల్‌పై విపరీతంగా ప్రతికూల ప్రచారం సాగుతున్నా ఆయన తన విశాల హృదయం, సద్గుణాలతో ప్రజల మనసులను గెలుచుకున్నారన్నారు. రాజస్ధాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలుపుతో రాహుల్‌ నాయకత్వంపై విశ్వాసం, ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నెలకొన్నదన్నారు. కాగా,

మరిన్ని వార్తలు