నాథూరాం గాడ్సేకు గుడి కట్టేశారు!

16 Nov, 2017 13:07 IST|Sakshi

భోపాల్‌: హిందూత్వ సంస్థ అయిన అఖిల భారతీయ హిందూ మహాసభ.. మహాత్మాగాంధీ హంతకుడైన నాథూరాం గాడ్సేకు ఘన నివాళులర్పించింది. గాడ్సే వర్థంతి సందర్భంగా గురువారం గ్వాలియర్‌లో ప్రతేక కార్యక్రమాన్ని నిర్వహించిన మహాసభ.. గాడ్సే అర్ధవిగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేసి.. శ్రద్ధాంజలి ఘటించింది. అంతేకాకుండా గాడ్సేకు గుడి కూడా కట్టినట్టు వెల్లడించింది.

గ్వాలియర్‌లో నాథూరాం గాడ్సేకు గుడి కట్టేందుకు హిందూ మహాసభ ప్రయత్నించగా.. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం అనమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 32 అంగుళాల పొడవున్న గాడ్సే విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసిన హిందూ మహాసభ..  ఆయనకు గుడి కట్టాలన్న తమ అభ్యర్థనను జిల్లా యంత్రాంగం నిరాకరించిందని, అయినప్పటికీ తమ సొంత స్థలంలో  గాడ్సే విగ్రహం ఏర్పాటుచేసి.. గుడి కట్టామని తెలిపింది. మహాసభకు చెందిన సొంత స్థలంలో గుడి కట్టినందున దీనిపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు జైవీర్‌ భరద్వాజ్‌ తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా