ఢిల్లీ కాలుష్య నియంత్రణకు టెరీ ప్రణాళిక

8 Nov, 2016 10:52 IST|Sakshi
ఢిల్లీ కాలుష్య నియంత్రణకు టెరీ ప్రణాళిక

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో కాలుష్య నివారణకు ది ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ (టెరీ) సోమవారం పది సూత్రాల అత్యవసర ప్రణాళికను ప్రకటించింది. ఇందులో... పంట దహనాన్ని తగ్గించడం, ఢిల్లీ–ఎన్ సీఆర్‌లో పదేళ్లకు పైబడిన డీజిల్‌ వాహనాలపై నిషేధం విధించడం లాంటివి ఉన్నాయి.

కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు ఈ ప్రణాళికను సమర్పిస్తూ దీన్ని సత్వరమే అమల్లోకి తేవాలని సిఫార్సు చేసింది. ఢిల్లీ కాలుష్యంపై సెంటర్‌ ఫర్‌ సైన్స్ అండ్‌ ఎన్విరాన్ మెంట్‌(సీఎస్‌ఈ) సమర్పించిన నివేదికపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపనుంది.

మరిన్ని వార్తలు