అయోధ్యలో టెర్రర్‌ అలర్ట్‌

15 Jun, 2019 11:21 IST|Sakshi

అయోధ్యలో ఉగ్రదాడికి అవకాశం- నిఘా వర్గాల హెచ్చరిక   

హై అలర్ట్‌ జారీ చేసిన అధికారులు

సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్యలో  హై అలర్ట్‌ జారీ అయింది. నగరాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  దీంతో పోలీసులు అయోధ్యలో అదనపు బలగాలను మోహరించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.  అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

వివాదాస్పద రామజన్మభూమి పరిసర ప్రాంతాల్లో కూడా అదనపు బలగాలను మోహరించారు. ఆలయ పరిసరాలతో పాటు ఇంటిలిజెన్స్‌ అధికారులు రైల్వే స్టేషన్, బస్టాండ్,  హోటళ్లలో ప్రధాన కూడళ్లలో ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.  సివిల్‌ దుస్తులోఉన్న నిఘా వర్గాలు పరిస్థితిని  క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయని,  భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని  ఎస్‌పీ అనిల్‌ కుమార్‌ సిసోడియా తెలిపారు.

కాగా శివసేన చీఫ్ ఉద్దవ్ ధాక్రే జూన్ 16 న తన పార్టీ ఎంపీలతో కలిసి అయోధ్య పర్యటనకు రానున్నారు. అలాగే 2005 రామజన్మభూమి దాడి అంశం జూన్ 18న విచారణకు రానుంది.  దీన్ని దృష్టిలో ఉంచుకొని కూడా భద్రతను మరింత పెంచినట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు