వలపు వలతో ఉగ్ర ఉచ్చు

3 Dec, 2018 20:26 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

జమ్ము : పాకిస్తాన్‌కు చెందిన ఉగ్ర సంస్థలు భారత్‌లో విద్రోహ చర్యలకు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నాయి. కశ్మీరీ యువతను ఉగ్ర ఉచ్చులోకి లాగేందుకు యువతులతో హనీట్రాప్‌కు తెగబడుతున్నాయి. భారత్‌లోకి చొచ్చుకువచ్చే ఉగ్రవాదులకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆయుధాలను చేరవేసేందుకు ఈ యువకుల సేవలను వినియోగించుకునేందుకు ఉగ్రమూకలు ప్రయత్నిస్తున్నాయని ఇంటెలిజెన్స్‌ అధికారులు హెచ్చరించారు. బండిపొర ప్రాంతంలో 30 ఏళ్లు పైబడిన సయ్యద్‌ సజియ అరెస్ట్‌తో హనీట్రాప్‌లపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు అధికారులను అప్రమత్తం చేశాయి.

కశ్మీర్‌లో యువకులు అనుసరించే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లతో సహా పలు సామాజిక మాధ్యమాల్లో ఆమెకు ఖాతాలున్నట్టు అధికారులు పేర్కొన్నారు. గత కొద్దినెలలుగా ఆమె వాడుతున్న ఐపీ చిరునామాపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు దృష్టిసారించాయి. యువకులతో ఆమె సంభాషిస్తూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తాము చెప్పిన కన్‌సైన్‌మెంట్‌ను చేరవేస్తేనే వారితో తాను కలుస్తానని ఆమె ముచ్చటించినట్టు వెల్లడైంది.

మరోవైపు సరిహద్దు వెంబడి భద్రతా దళాల కదలికలను తెలుసుకునేందుకు ఆమె జమ్మూ కశ్మీర్‌లోని పలు పోలీస్‌ అధికారులతోనూ ఆమె పరిచయం పెంచుకున్నట్టు చెబుతున్నారు. కశ్మీరీ యువతను ఉగ్రవాదానికి ఆకర్షితులను చేసేందుకు మిలిటెంట్లలో తనలాగే పలువురు మహిళలున్నారని దర్యాప్తులో సజియ వెల్లడించింది. ఇక ఆమె అరెస్ట్‌కు వారం ముందు అసియా జన్‌ (28) అనే యువతిని జమ్ము కశ్మీర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి ఆమె వద్ద గ్రనేడ్లు ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మందు తాగడం జీవన విధానం: బీజేపీ నేత 

రాజ్యసభ ఎన్నికలు మరిన్ని రోజులు వాయిదా

రాష్ట్రాలకు కేంద్రం 11 వేల కోట్ల నిధులు

ఇంటి నుంచే జీఆర్‌ఈ, టోఫెల్‌

కేసులు 3,041.. మరణాలు 90

సినిమా

ఫిల్మ్‌ జర్నలిస్టుల కోసం అండగా...

నవ్వులతో రెచ్చిపోదాం

నాలుగు వేడుకల పెళ్లి

పని పంచుకోండి

ఎంతో నేర్చుకున్నా

జోడీ కుదిరిందా?