ఉగ్రవాదుల కాల్పుల్లో ఆరుగురు మృతి

16 Jun, 2017 19:56 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంత్‌నాగ్‌ జిల్లా హజవిరా ఆచాబాల్లో పోలీస్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు శుక్రవారం దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు.  మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఓ అధికారితో పాటు అయిదుగురు పోలీసులు మృతి చెందారు. కాగా ఈ దాడిలో సుమారు 15మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం.

మరోవైపు జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో టాప్‌ లష్కరే తోయిబా కమాండర్‌ జునేద్‌ మట్టూ మరణించాడు. అనంత్‌నాగ్‌ జిల్లాలోని ఆర్వాణీ గ్రామంలో తీవ్రవాదులన్నారన్న సమాచారంతో ఆర్మీ, జమ్మూ కశ్మీర్‌ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సంయుక్తంగా ఆపరేషన్‌ జరిపాయి.

ఈ ఎన్‌కౌంటర్‌లో కమాండర్‌తో మరో ఇద్దరు లష్కరే మిలిటెంట్లు మరణించినట్లు తెలుస్తోంది. భద్రతా దళాలను చూడగానే స్థానిక  యువత రాళ్ల దాడి ప్రారంభించింది. పలు ఉగ్రదాడుల్లో జునేద్‌ హస్తం ఉందని ఆర్మీ తెలిపింది. ఇక నిన్న వేర్వేరు ఘటనల్లో ఉగ్రదాడుల్లో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

మరిన్ని వార్తలు