మాస్క్‌ల తయారీకి సిద్దమైన ప్రముఖ వస్త్ర కంపెనీ!

17 Jun, 2020 20:49 IST|Sakshi

ముంబాయి: కరోనావైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్‌లు వాడటం అ‍త్యవసరంగా మారింది. సైంటిఫిక్‌ పద్దతిలో చాలా కంపెనీ కరోనా వైరస్‌ను ఎదుర్కోనే విధంగా ఈ మాస్క్‌లను తయారు చేస్తున్నాయి. ఈ సమయంలో ప్రముఖ  బ్రాండ్‌ కంపెనీ తెవారో టెక్నాలజీ కంపెనీలు, ల్యాబరేటరీల సాయంలో హైజీన్‌, ఫ్యాషన్‌ కలగలిపిన మాస్క్‌లను తయారు చేస్తోంది.

 వైరల్‌ షీల్డ్‌ పేరుతో హైజీన్‌ మాస్క్‌లు, గ్లౌజ్‌లను తయారు చేస్తోంది. యాంటీ వైరస్‌ మాస్క్‌లను తయారుచేస్తున్న మొట్టమొదటి దుస్తుల కంపెనీగా తెవారో నిలిచింది. ఈ మాస్క్‌ రెండు కాటన్‌పొరలను కలిగి ఉండి, శ్వాస తీసుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది కలగని మెత్తటి మెటీరియల్‌తో తయారుచేస్తున్నారు. ఈ మాస్క్‌లను ల్యాబ్‌లో పరీక్షించగా 99.99 శాతం వైరస్‌ నుంచి రక్షణ కల్పిస్తున్నాయి. అందరికి అందుబాటు ధరల్లో ఈ మాస్క్‌లను తీసుకువస్తున్నామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. అమెజాన్‌తో పాటు కొన్ని మెడికల్‌ స్టోర్స్‌ ద్వారా ఈ మాస్క్‌లను అందుబాటులోకి తెచ్చెందుకు తెవారో ప్రయత్నిస్తోంది. (మాస్క్.. 3 పొరలుంటే భేష్)

మరిన్ని వార్తలు