టీఎంసీ వార్డు స్థాయి కాంపిటీషన్‌

3 May, 2020 20:11 IST|Sakshi
థానే మున్సిపల్‌ కార్పోరేషన్‌

థానే మున్సిపల్‌ కార్పోరేషన్‌ వినూత్న నిర్ణయం

థానే : కరోనా లాక్‌డౌన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, నియమాలు పాటించేలా చేసేందుకు థానే మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ నియమాలను పాటించే వార్డులకు విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం వార్డు స్థాయిలో కాంటెస్ట్‌లు నిర్వహిస్తోంది. అంతేకాకుండా నిర్ణీతకాలం పాటు ఒక్క కరోనా కేసుకూడా నమోదు కాని వార్డులకు 25-50 లక్షల రూపాయలు అందించనుంది. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనడానికి డిజిథానే యాప్‌ను తప్పక ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ( ట్రాక్టర్‌పై పెద్ద పులితో పోరాడి.. ) 

కాంటెస్ట్‌లో పాల్గొనే వార్డులపై టీఎమ్‌ఎసీ ప్రత్యేక నిఘా పెట్టనుంది. ఆ వార్డులు లాక్‌డౌన్‌ నియమాలు పాటిస్తున్నాయా లేదా తెలుసుకోవటానికి సీసీటీవీ కెమెరాలు, పోలీసుల సహాయం తీసుకోనుంది. దీనిపై మేయర్‌ నరేష్‌ మస్క్‌ మాట్లాడుతూ.. ‘‘ దాదాపు 80 శాతం ప్రజలు లాక్‌డౌన్‌ నియమాలు పాటిస్తున్నారు. మిగిలిన 20శాతం మంది కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందుకే టీఎమ్‌సీ ఈ నిర్ణయం తీసుకుంద’’ని తెలిపారు. (యూపీలో అరుదైన దృశ్యాలు క‌నువిందు )

మరిన్ని వార్తలు