ఆర్మీ ఎగ్జామ్ పేపర్ లీక్.. పరీక్షలు రద్దు

26 Feb, 2017 16:00 IST|Sakshi
ఆర్మీ ఎగ్జామ్ పేపర్ లీక్.. పరీక్షలు రద్దు

థానె: ఆర్మీలో పలు ఉద్యోగాల నియామకాలకు ఆదివారం నిర్వహించాల్సిన ప్రశ్నా పత్రం లీక్ అయింది. దీనికి సంబంధించి పుణె, నాగ్పూర్, నాసిక్ లకు చెందిన 300 మంది విద్యార్థులను, 18 మంది నిందితులను థానె పోలీసులు అరెస్టు చేశారు. పుణెలో ప్రశ్నా పత్రం లీక్ అయినట్టు గుర్తించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆర్మీ ఉద్యోగాల నియామకాల పరీక్షలను రద్దు చేశారు.

ఈ రోజు తెల్లవారుజామున సుమారు 350మంది విద్యార్థులకు  కోచింగ్ సెంటర్లు ప్రశ్నాపత్రాన్ని అమ్మాయి. ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.2లక్షలు వసూలు చేశారు. పక్కా సమాచారాన్ని అందుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. పలు కోచింగ్ సెంటర్ల యాజమానులను, ఆర్మీ ఉద్యోగులను అరెస్టు చేసినట్లు థానె క్రైం బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నితిన్ ఠాక్రే తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రశ్నాపత్రం లీక్ చేసిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్మీ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసినట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు