థ్యాంక్యూ ఇండియా.. : పాక్‌ దంపతులు

19 Jul, 2017 14:58 IST|Sakshi
థ్యాంక్యూ ఇండియా.. : పాక్‌ దంపతులు

నోయిడా: ప్రస్తుతం భారత్‌ పాక్‌ల మధ్య పచ్చగడ్డి వేస్త భగ్గుమంటోంది. ప్రతిరోజు సరిహద్దుల్లో కాల్పులతో భారత సైన్యాన్ని పాక్‌ పొట్టన పెట్టుకుంటోంది. కానీ భారత్‌ మాత్రం నమ్మిన వారికి అండగా నిలుస్తోంది. మన పెద్దలు చెప్పినట్లు ఆపదలో ఉన్నప్పుడు శత్రువైనా మనం కాపాడాలి అనే సిద్దాంతం భారత్‌ది. సరిగ్గా అలాంటి ఘటనలకు ఇండియా చిరునామాగా నిలుస్తోంది. తన బిడ్డ ప్రాణాలు పోతున్నాయని పాకిస్తాన్‌కు చెందిన దంపతులు చేసిన విన్నపాన్ని మన్నించింది. వీసా జారీ చేసి ఆచిన్నారి ప్రాణాన్ని కాపాడింది.

వివరాల్లోకి వెళ్తే పాకిస్తాన్‌కు చెందిన కాన్వాల్‌ సిద్ధిక్‌ సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. తన కుమారుడు రోహాన్‌ గుండెకు చిల్లుపడిందని శష్త్ర చికిత్స చేస్తేగాని బ్రతకడు అని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో తమ బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి దంపతులిద్దరూ దుబాయ్‌, ఇతర దేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే భారత్‌లోని వైద్యుల గురించి తెలుసుకున్న సిద్దిక్‌ భారత్‌ రావాలని వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ప్రస్తుతం భారత్‌ పాక్‌ల మధ్య ఉన్న పరిస్థితుల దృష్ట్యా వీసా దరఖాస్తు రద్డయింది. దీంతో సోషల్‌ మీడియా ట్విట్టర్‌లో తమ పరిస్థితిని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు తెలియచేశారు. దీనిపై స్పందించిన మంత్రి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. దీంతో సిద్దిక్‌ తన కుమారుడిని నోయిడాలోని జైపీ హాస్పిటల్‌లో గతనెల 12న చేర్పించాడు. జూన్‌ 14న ఐదుగంటలపాటు శ్రమించి రోహన్‌కు ఆపరేషన్‌ చేసి కాపాడారు.  నెలరోజుల పరీక్షల అనంతరం సిద్దిక్‌ కుటుంబం నేడు పాకిస్తాన్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈసందర్భంగా దంపతులిద్దరు భారత్‌కు, వీసాకు సహకరించిన సుష్మా స్వరాజ్‌కు ధన్యవాదాలు తెలిపారు. చనిపోతాడనుకున్న తన కుమారుడికి ప్రాణం పోసినందుకు చాలా థ్యాంక్స్‌ అంటూ ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు