ఆ ఉపగ్రహాల బరువు 1,500 కిలోలు

8 Feb, 2017 04:39 IST|Sakshi
ఆ ఉపగ్రహాల బరువు 1,500 కిలోలు

శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ద్వారా ప్రయోగించనున్న 104 ఉపగ్రహాల బరువు 1,500 కిలోలు. ప్రయోగాన్ని ఈ నెల 15న ఉదయం 9.28కు నిర్వహించనున్నారు. కౌంట్‌డౌన్‌ను 14న ఉదయం 5.48కు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

1,500 కిలోల బరువున్న 104 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వాటికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా 650 కిలోల బరువున్న కార్టోశాట్‌–2డీ, 30 కిలోల బరువున్న ఇస్రో నానో శాటిలైట్స్‌(ఐఎన్‌ఎస్‌–1ఏ,1బీ) స్వదేశీ ఉపగ్రహాలతోపాటు 820 కిలోలున్న 101 విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు.

మరిన్ని వార్తలు