సుష్మా ఇంటిని ముట్టడించేందుకు యత్నం

20 Jun, 2015 13:11 IST|Sakshi
సుష్మా ఇంటిని ముట్టడించేందుకు యత్నం

న్యూఢిల్లీ: మాజీ ఐపిఎల్ చీఫ్ లలిత్ మెదీ వీసా వివాదంలో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు  శనివారం హస్తినలో ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని సుష్మా ఇంటిని ముట్టడిం చేందుకు ఆప్ శ్రేణులు ప్రయత్నించాయి. భారీ ర్యాలీగా వెళ్లిన కార్యకర్తలు సుష్మా ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించాయి.

ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గత ఆందోళనల నేపథ్యంలో సుష్మా ఇంటి వద్ద బందోబస్తు పెంచిన పోలీసులు బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్లను తోసుకొని సుష్మా ఇంటి ముట్టడికి ఆప్ కార్యకర్తలు ప్రయత్నించారు. మంత్రి పదవికి సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.


లలిత్ మోదీ వీసా వ్యవహారంలో చిక్కుల్లో పడిన కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్  మానవతా దృక్పథంతోనే ఈ సాయం చేశానని వివరణ ఇచ్చినా.. ఈ వ్యవహారంలో ఆమెకు లబ్ధి చేకూరిందని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శిస్తున్నాయి. తక్షణమే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.

మరోవైపు సుష్మా స్వరాజ్ న్యూయార్క్ బయల్దేరి వెళ్లిపోయారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఆమె న్యూయార్క్ వెళ్లారు. లలిత్ మోదీ వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో ఆమె న్యూయార్క్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తలు