టేకాఫ్‌ సమయంలో పక్షి ఢీ కొట్టడంతో..

16 Jul, 2017 17:32 IST|Sakshi
టేకాఫ్‌ సమయంలో పక్షి ఢీ కొట్టడంతో..
రాంచీ: టేకాఫ్‌ తీసుకుంటున్న సమయంలో పక్షి ఢీకొనడంతో ఎయిర్‌ ఏసియా ఇండియా విమానం వెనక్కు వచ్చింది. జార్ఖండ్‌లోని రాంచీ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న ఈ విమానం ఎయిర్‌పోర్టు(బిర్సామండా)లో టేకాఫ్‌ తీసుకుంటున్న క్రమంలో పక్షి ఢీకొంది. దీంతో విమానం సిబ్బంది వెంటనే ప్రయాణాన్ని రద్దు చేసి ప్రయాణికులను రన్‌వే మీదకు దింపారు. ఈ సమాచారాన్ని విమాన సంస్థ ఎండీ, సీఈఓ అమర్‌ అబ్రాల్‌ తెలిపారు.

అయితే ఈ సంఘటన కారణంగా ప్రయాణికులెవరికీ ఎలాంటి నష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదన్నారు. వారికోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పారు.  అక్కడ అత్యవసర ఏర్పాట్లు ఏమీ లేకపోవడంతో విమానం ఇంకా రాంచీ ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయింది. పక్షి ఢీకొనడంతో విమానం రెక్కలు బాగా దెబ్బతిన్నాయి. సంఘటన జరిగిన సమయంలో విమానంలోనుంచి పొగలు వచ్చాయని, దాంతో ప్రయాణికులను అత్యవసర ద్వారం గుండా బయటకు తెచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 
మరిన్ని వార్తలు